అంతిమయాత్రలో అన్నీతానై...!

ABN , First Publish Date - 2022-01-03T06:30:11+05:30 IST

వైసీపీ నేత తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని, ఆమె పాడె మోసి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శభాష్‌ అన్పించుకున్నారు.

అంతిమయాత్రలో అన్నీతానై...!
సుభద్రమ్మ పాడెమోస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

శ్రీకాళహస్తి, జనవరి 2: జాతర, నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని సందడి చేస్తారు. కష్టమొచ్చిందంటే ఆదుకునేందుకు ముందుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్త తల్లి మృతిచెందిన విషయం తెలుసుకుని, ఆమె పాడె మోసి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శభాష్‌ అన్పించుకున్నారు. వివరాలివీ.. వైసీపీ శ్రీకాళహస్తి పట్టణాధ్యక్షుడు పగడాల రాజు తల్లి సుభద్రమ్మ శనివారం మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఆమె మృతదేహానికి నివాళులర్పించి రాజుకు సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన పాడె కూడా మోసి, కైలాసధామంలో అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండిపోయారు. 

Read more