పాలట్యాంకర్‌ను ఢీకొన్న మినీ బస్సు

ABN , First Publish Date - 2022-06-07T06:59:38+05:30 IST

మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి వద్ద సోమవారం ముందు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను ఓ మినీ బస్సు ఢీకొనడంతో 30 మంది గాయపడ్డారు.

పాలట్యాంకర్‌ను ఢీకొన్న మినీ బస్సు
పాలట్యాంకర్‌ను ఢీకొన్న మినీ బస్సు

30 మందికి గాయాలు

బంగారుపాళ్యం, జూన్‌ 6: మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి వద్ద సోమవారం ముందు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను ఓ మినీ బస్సు ఢీకొనడంతో 30 మంది గాయపడ్డారు. సీఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు .. కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరు భక్తులు మినీ బస్సులో తీర్థయాత్రలకు బయలుదేరారు. కొత్తపల్లి జాతీయ రహదారిలో వేగంగా వెళుతుండగా బస్సు అదుపు తప్పి ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను ఢీకొంది. బస్సులో ఉన్న 30 మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం వారి స్వస్థలాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more