దుర్గాదేవిగా మరగదాంబిక

ABN , First Publish Date - 2022-10-05T06:35:51+05:30 IST

కాణిపాకంలోని మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రులలో భాగంగా మంగళవారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

దుర్గాదేవిగా మరగదాంబిక

కాణిపాకంలోని మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రులలో భాగంగా మంగళవారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి, అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు. 

- ఐరాల(కాణిపాకం)

Read more