మహాత్మా ముఖ్యమంత్రి మనసు మార్చు

ABN , First Publish Date - 2022-10-03T05:11:25+05:30 IST

సీఎం జగన్‌ మనసు మార్చి మంచి పరిపాలన అందించే విధంగా దీవించమని మహాత్మాగాంధీ చిత్రపటానికి టీడీపీ నాయకులు వినతిపత్రం అందించారు.

మహాత్మా ముఖ్యమంత్రి మనసు మార్చు
గాంధీ చిత్రపటానికి వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు

పెద్దపంజాణి, అక్టోబరు 2:  సీఎం జగన్‌ మనసు మార్చి మంచి పరిపాలన అందించే విధంగా దీవించమని మహాత్మాగాంధీ చిత్రపటానికి టీడీపీ నాయకులు వినతిపత్రం అందించారు. గాంధీ జయంతి సందర్బంగా ఆదివారం పెద్దపంజాణి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించిన అనంతరం ఎన్టీఆర్‌ వైద్య వర్సిటీకి పేరు మార్చడం తగదని తిరిగి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని పార్టీ నాయకులు మహాత్ముడి చిత్రపటానికి వినతి పత్రం అందించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించనున్న రిలేనిరాహార దీక్షకు మాజీ మంత్రి అమరనాథరెడ్డి హాజరు అవుతారని పేర్కొన్నారు. ఈ దీక్షకు అనుమతి కోసం స్థానిక పోలీసులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆనందకుమార్‌, మురహరిరెడ్డి, నాగరాజరెడ్డి, చలపతి, సర్పంచ్‌ రుద్రమూర్తినాయుడు, శంకరప్ప, ధనుంజయ, ము న్వర్‌బాషా, సలాంసాహెబ్‌, గణపతి, ప్రభాకర్‌, ఈశ్వరయ్య పాల్గొన్నారు.  


Read more