పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందాం: అమర్‌

ABN , First Publish Date - 2022-09-30T04:38:58+05:30 IST

త్వరలో జరుగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికను టీడీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందాం: అమర్‌
పలమనేరు టీడీపీ కార్యాలయంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి అమర్‌

పలమనేరు, సెప్టెంబరు 29: త్వరలో జరుగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికను టీడీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికపై నియోజకవర్గ క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జీలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి తూర్పురాయలసీమ పట్టభద్రుడు, శాసనమండలి టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్‌ హాజరయ్యారు.  పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీనేతలు తప్పకుండా పాల్గొన్నాలని అమర్‌ దిశానిర్దేశం చేశారు. తాను మండలికి ఎన్నికైతే పట్టభద్రుల గళం వినిపిస్తానని శ్రీకాంత్‌ పేర్కొన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కులను ప్రశ్నించడమే కాక వాటి సాధనకు కృషి చేస్తానని చెప్పారు.  ఆర్వీబాలాజి, సుబ్రమణ్యం గౌడు, వెంకటరమణారెడ్డి, బ్రహ్మయ్య, చాంద్‌భాషా, ఖాజాపీర్‌, ఆర్బీసీకుట్టి, రంగనాథ్‌, సోమశేఖర్‌గౌడు, నాగరాజరెడ్డి, వెకంటమునిరెడ్డి, ఆనంద్‌, సుబ్రమణ్యంశెట్టి, సుధాకర్‌రెడ్డి, జగదీష్‌నాయుడు, గిరిబాబు, నాగరాజు, మదన్‌ మోహన్‌ తోపాటు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శివకుమారి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. 

కుప్పం: పట్టభద్రులంతా తనకు ఓటేసి గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్లశ్రీకాంత్‌ కోరారు. గురువారం కుప్పానికి వచ్చిన శ్రీకాంత్‌ను స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారిశ్రీనివాసులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ మునిరత్నం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ వైసీపీ రాష్ట్ర యువతను ఘెరంగా మోసం చేసిందన్నారు. ఎన్నికల సభల్లో జాబ్‌ కేలండర్‌ అంటూ నిరుద్యోగ యువతలో ఆశలు కల్పించిన సీఎం జగన్‌ గద్దెనెక్కగానే ఆ విషయం విస్మరించారన్నారు. రాష్ట్రంలో విద్యావంత యువత భవిష్యత్‌ బాగు పడాలంటే తిరిగి చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తనకు ఓటేసి గెలిపించి చంద్రబాబు నాయకత్వ అవసరాన్ని రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆనందరెడ్డి, గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T04:38:58+05:30 IST