దేవరెద్దుకు అంతిమ సంస్కారం

ABN , First Publish Date - 2022-09-27T05:39:33+05:30 IST

గుడిపాల మండలం పెద్దదళవాయిపల్లెలోని బసవ నారాయణ స్వామి (దేవరెద్దు) అనారోగ్యంతో మృతిచెందడంతో సోమవారం గోళ్ల, పంట్ర వంశస్థులు కోలాటాలు, కత్తులతో శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

దేవరెద్దుకు అంతిమ సంస్కారం
మరణించిన దేవరెద్దుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న గోవింద భక్తులు

గుడిపాల, సెప్టెంబరు 26: గుడిపాల మండలం పెద్దదళవాయిపల్లెలోని బసవ నారాయణ స్వామి (దేవరెద్దు) అనారోగ్యంతో మృతిచెందడంతో సోమవారం గోళ్ల, పంట్ర వంశస్థులు కోలాటాలు, కత్తులతో శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దేవరెద్దుకు వెంకటేశ్వరస్వామి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేయించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగించి అంతిమ సంస్కారాన్ని నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే బసవ నారాయణస్వామి మృతిచెందడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ అంతిమ కార్యక్రమానికి పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. 

Read more