జిల్లా కేంద్రానికి భూహక్కు పత్రాలు

ABN , First Publish Date - 2022-09-30T05:37:23+05:30 IST

వైఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పథకానికి సంబంధించిన భూహక్కు పత్రాలు గురువారం కలెక్టరేట్‌కు చేరాయి.

జిల్లా కేంద్రానికి భూహక్కు పత్రాలు
భూహక్కు పత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసిలు

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 29: వైఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూరక్ష పథకానికి సంబంధించిన భూహక్కు పత్రాలు గురువారం కలెక్టరేట్‌కు చేరాయి. అక్టోబరు 2 గాంధీజయంతి సందర్భంగా వాటిని రైతులకు అందజేయనున్నారు. చిత్తూరుకు చేరిన భూహక్కు పత్రాలను కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌ రెడ్డి, జేసీ ఎస్‌.వెంకటేశ్వర్లు పరిశీలించారు. రైతులకు చెందిన వ్యక్తిగత ఖాతా, గతంలో ఉన్న సర్వే నంబర్లు, కొత్తగా అందిన భూహక్కు పత్రాలు, పుస్తకాల్లో ఉన్న నంబర్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించారు. తొలివిడతగా 12 గ్రామాలకు సంబంధించిన భూరికార్డులు కలెక్టరేట్‌కు అందగా, వాటిని పరిశీలించేందు కు ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులకు పంపనున్నారు. 

Updated Date - 2022-09-30T05:37:23+05:30 IST