-
-
Home » Andhra Pradesh » Chittoor » Lakshminarasimhudi Kalyanotsavam-NGTS-AndhraPradesh
-
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం
ABN , First Publish Date - 2022-03-16T06:12:12+05:30 IST
తరిగొండ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు.

గుర్రంకొండ, మార్చి 15: తరిగొండ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారిని మేల్కొలిపి ఆలయశుద్ధి, తోమాలసేవ, అర్చన, అభిషేకాలు చేశారు. అనంతరం తిరుచ్చి వాహనంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను సర్వభూపాల వాహనంలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ అధికారులు తెచ్చిన పట్టు వస్ర్తాలతో స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛణల నడుమ స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కల్యాణోత్సవం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు మణికంఠభట్టార్, గోపాల్ భట్టార్, కృష్ణప్రసాద్, కృష్ణరాజ్, అనిల్, గోకుల్, నరసింహులు, వరద, వెంకీ, సుందరరాజు పాల్గొన్నారు.