కుప్పం విద్యార్థికి నిట్‌లో జాతీయ ర్యాంకు

ABN , First Publish Date - 2022-07-07T06:09:09+05:30 IST

కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివిన పి.జనార్దన్‌ అనే విద్యార్థికి నిట్‌ ఎంసీఏ ఎంట్రెన్స్‌లో జాతీయస్థాయిలో 155వ ర్యాంకు వచ్చినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ జె.లక్ష్మీనారాయణ తెలిపారు

కుప్పం విద్యార్థికి నిట్‌లో జాతీయ ర్యాంకు
జనార్దన్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణ

కుప్పం, జూలై 6: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివిన పి.జనార్దన్‌ అనే విద్యార్థికి నిట్‌ ఎంసీఏ ఎంట్రెన్స్‌లో జాతీయస్థాయిలో 155వ ర్యాంకు వచ్చినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ జె.లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా జనార్దన్‌ను కళాశాలలో అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ... పేద కుటుంబంలో పుట్టి, కుప్పం ప్రభుత్వ కళాశాలలో చదివిన జనార్దన్‌కు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వంటి జాతీయ సంస్థలో ఎంసీఏ సీటు రావడం కళాశాలకే కాక మొత్తం నియోజకవర్గానికే గర్వకారణమని పేర్కొన్నారు. తనకు నిట్‌లో సీటు రావడానికి డిగ్రీలో పునాదులు వేసిన ప్రిన్సిపాల్‌ లక్ష్మీనారాయణకు, అధ్యాపకులు మాధవి, శ్రీనుకు జనార్దన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రామసుబ్బారెడ్డి, అధ్యాపకులు గణేశ్‌, నారాయణమూర్తి, ప్రభుదాస్‌, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Read more