కుప్పం ఆర్డీవో కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2022-04-05T06:12:44+05:30 IST

కుప్పం ప్రజల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు సాకారమైంది. కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడడమే కాకుండా దానికి మంచి కార్యాలయం కూడా ప్రారంభమైౖంది.

కుప్పం ఆర్డీవో కార్యాలయం ప్రారంభం

కుప్పం, ఏప్రిల్‌ 4: కుప్పం  ప్రజల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు సాకారమైంది. కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడడమే కాకుండా దానికి మంచి కార్యాలయం కూడా  ప్రారంభమైౖంది. కుప్పం మండలం గణేశ్‌పురం సమీపంలో గల నాక్‌ పరిపాలనా భవనం కింది ఫ్లోర్‌లో సోమవారం ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్సీ భరత్‌ ప్రారంభించారు. అనంతరం మేళతాళాలతో నూతన ఆర్డీవో శివయ్యతోపాటు పలువురు వైసీపీ నాయకులు, ప్రముఖులు కార్యాలయంలోకి ప్రవేశించారు. పూజ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ భరత్‌ మాట్లాడుతూ ప్రజల చిరకాల వాంఛ ఇన్నాళ్లకు తీర్చినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీవో శివయ్య మాట్లాడుతూ... డివిజన్‌ పరిధిలోని భూ వివాదాల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌తోపాటు పలువురు నాయకులు, తహసీల్దారు సురేశ్‌బాబు, తహసీల్దారు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Read more