బతికుండగానే చంపేశారు!

ABN , First Publish Date - 2022-12-13T02:08:03+05:30 IST

వలంటీర్‌ మొదలుకుని వీఆర్వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో...అందరి నిర్లక్ష్యం కారణంగా నేను చనిపోయినట్లు రేషన్‌ కార్డులో నమోదు చేశారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందడం లేదంటూ ఓ మహిళ భోరున విలపించారు.

బతికుండగానే చంపేశారు!
విలపిస్తున్న రాజేశ్వరి

తిరుపతి కలెక్టరేట్‌,డిసెంబరు 12 : వలంటీర్‌ మొదలుకుని వీఆర్వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో...అందరి నిర్లక్ష్యం కారణంగా నేను చనిపోయినట్లు రేషన్‌ కార్డులో నమోదు చేశారు.ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అందడం లేదు. రేషన్‌ కూడా ఇవ్వడం లేదు.ఇలా చేస్తే మొగుడు చనిపోయి ఇద్దరు బిడ్డలను సాకాల్సిన నా పరిస్థితి ఏంటని 18నెలలుగా మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా....ఇంతవరకూ న్యాయం జరగలేదంటూ ఓ మహిళ భోరున విలపించడం కలెక్టరేట్‌లో సోమవారం చూపరులను కదిపేసింది.స్పందన కార్యక్రమానికి హాజరైన రేణిగుంట మండలం జీపాళెం పంచాయతీ, కుర్రకాల్వ గ్రామానికి చెందిన ఆమె పేరు రాజేశ్వరి.ఆమె వేదన గమనించిన మిగిలిన అర్జీదారులు కూడా మద్దతు తెలిపి న్యాయం చేయమంటూ అధికారులను అడిగారు.రాజేశ్వరికి న్యాయం చేస్తామని అధికారులు కూడా హామీ ఇచ్చారు.

Updated Date - 2022-12-13T02:08:03+05:30 IST

Read more