కిడ్నాప్‌ కేసు నమోదు?

ABN , First Publish Date - 2022-05-30T05:46:06+05:30 IST

చిల్లకూరు పోలీస్‌స్టేసన్‌ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు కిడ్నాప్‌ చేసినట్లు బాధితుడు ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందిం చడంతో కేసునమోదు చేసినట్లు తెలిసింది.

కిడ్నాప్‌ కేసు నమోదు?

చిల్లకూరు, మే 29: చిల్లకూరు పోలీస్‌స్టేసన్‌ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు కిడ్నాప్‌ చేసినట్లు బాధితుడు ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందిం చడంతో కేసునమోదు చేసినట్లు తెలిసింది. మదనపల్లికి చెందిన ఓ వ్యక్తి కార్ల క్రయవిక్రయాలకు సంబంధించి కొందరిని మోసంచేసినట్లు తెలుస్తోంది. మోసపోయిన వారు తమకు రావాల్సిన నగదును అడగగా ఆ వ్యక్తి సమా ధానం చెప్పకపోవడంతో కావలి వద్ద పట్టుకుని చిల్లకూరు మండలంలోని మన్నెగుంట సమీప ప్రాంతంలో నిర్బంధించినట్లు తెలిసింది. కిడ్నాప్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 

Read more