వైసీపీ నేత గోడౌనులో కర్ణాటక మద్యం

ABN , First Publish Date - 2022-12-30T00:59:38+05:30 IST

వి.కోట మండలం నాయకనేరిలో వైసీపీ నేత గోడౌనులో కర్ణాటక మద్యం, తమిళనాడు రాష్ట్ర రేషన్‌ బియ్యం గురువారం పట్టుబడ్డాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైసీపీ నేత గోడౌనులో కర్ణాటక మద్యం
వైసీపీ వర్గీయుల గోదాములో పట్టుబడిన మద్యం కేస్‌లు

నాయకనేరిలో టీడీపీ నేతల ఫిర్యాదుతో పట్టుకున్న పోలీసులు

ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పరస్పరం కేసుల నమోదు

వి.కోట, డిసెంబరు 29: వి.కోట మండలం నాయకనేరిలో వైసీపీ నేత గోడౌనులో కర్ణాటక మద్యం, తమిళనాడు రాష్ట్ర రేషన్‌ బియ్యం గురువారం పట్టుబడ్డాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పొలానికి దారి కోసం నెలకొన్న గొడవ ముదిరి వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో నాయకనేరిలో రెండు రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. దారి విషయమై టీడీపీ సీనియర్‌ నేత ప్రమేయంతో తమకు న్యాయం జరగలేదని వైసీపీ వర్గీయులు బుధవారం రాత్రి లింగాపురంలోని ఆయన ఇంట్టి వద్దకు వెళ్ళి దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున లింగాపురానికి చేరుకుని తమ పార్టీ నాయకుడికి అండగా నిలిచారు. ఈ క్రమంలో గొడవ తీవ్రమైంది. అధికార పార్టీ నేతల అండదండలతో కర్ణాటక మద్యం తెచ్చి బెల్టుదుకాణాలకు తరలిస్తూ పల్లెలో చిచ్చు రేపుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించరాదంటూ టీడీపీ శ్రేణులు పట్టుబట్టారు. ఈ తరుణంలో నాయకనేరిలోని అధికార పార్టీ నేతల గోదాములో మద్యంతోపాటు, తమిళనాడు రాష్ట్ర రేషన్‌ బియ్యాన్ని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ప్రసాద్‌బాబు, సిబ్బందితో వచ్చి గోదాములోని ఆటోలో ఉన్న బియ్యం సంచులను, టెంపోలో ఉన్న మద్యం కేసులను గుర్తించారు. మద్యం సీజ్‌ చేసి కేసు నమోదు చేస్తామని, బియ్యం తమ పరిధిలోనికి రాదని సీఐ చెప్పారు. దీనికి గ్రామస్తులు, టీడీపీ వర్గీయులు అంగీకరించలేదు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడ్డారు. దీంతో కాసేపు పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో వీఆర్వోతో కలిసి ఆర్‌ఐ మోహన్‌రెడ్డి అక్కడకు చేరుకుని గోదాములో ఉన్న 18 బస్తాలు, ఆటోల్లోని 10 బస్తాల తమిళనాడు రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేసి పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఇళ్ళలో సోదాలు చేయించడం పట్ల అధికార వర్గీయుల కుటుంబీకులు టీడీపీ వారిని దూషించడంతో ఘర్షణకు దారి తీసింది. ఇరు పక్షాలు బాహాబాహీకి దిగగా.. పోలీసులు చెదరగొట్టారు. నాలుగు కేస్‌ల కర్ణాటక మద్యాన్ని, తమిళనాడు రేషన్‌ బియ్యాన్ని, మూడు వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ ప్రసాద్‌బాబు, ఆర్‌ఐ మోహన్‌రెడ్డి ప్రకటించడంతో టీడీపీ వర్గీయులు వెనుదిరిగారు. రెండు రోజులుగా జరిగిన ఘటనలపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు

Updated Date - 2022-12-30T00:59:38+05:30 IST

Read more