కాణిపాక ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తా

ABN , First Publish Date - 2022-11-19T00:10:41+05:30 IST

ఉభయదారులు, సిబ్బంది, స్థానికుల సహకారంతో కాణిపాక ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నూతన ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

కాణిపాక ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తా
ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న వెంకటేశ్వర్లు

ఐరాల(కాణిపాకం), నవంబరు 18: ఉభయదారులు, సిబ్బంది, స్థానికుల సహకారంతో కాణిపాక ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నూతన ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలయ ప్రాశస్త్యం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తానన్నారు. కాణిపాక ఆలయ ఈవోగా శుక్రవారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈవోగా పని చేస్తున్న రాణాప్రతాప్‌ బదిలీపై దేవదాయ శాఖ హెడ్‌ ఆఫీ్‌సకు వెళ్లారు. కడప డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు బదిలీపై ఇక్కడ నియమితులయ్యారు. తాను రెండోసారి ఈవోగా పని చేయడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన్ను పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు దుశ్శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈఈ వెంకటనారాయణ, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:10:41+05:30 IST

Read more