-
-
Home » Andhra Pradesh » Chittoor » Kadiri Electricity Reilingen runs on the way to Thumanangutta-NGTS-AndhraPradesh
-
కదిరి - తుమ్మణంగుట్ట మార్గంలో విద్యుత్ రైలింజన్ పరుగులు
ABN , First Publish Date - 2022-03-16T05:55:51+05:30 IST
అనంతపురం జిల్లా కదిరి నుంచి బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట వరకు మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ రైలింజన్ ట్రయల్ రన్ విజయవంతమైంది.

ములకలచెరువు, మార్చి 15: అనంతపురం జిల్లా కదిరి నుంచి బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట వరకు మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ రైలింజన్ ట్రయల్ రన్ విజయవంతమైంది.ధర్మవరం నుంచి పాకాల వరకు ఉన్న 226 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని విద్యుదీకరణ చేసేందుకు నిధులు విడుదల చేయగా గత ఏడాది డిసెంబర్లోనే కదిరి వరకు పనులు పూర్తయ్యాయి.కదిరి నుంచి పాకాల మార్గంలో ములకలచెరువు మీదుగా బి.కొత్తకోట మండలం తుమ్మణంగుట్ట వరకు చేపట్టిన 61 కిలో మీటర్లు, కలికిరి నుంచి పాకాల వరకు 50 కిలోమీటర్లు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి.ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కొత్త లైనుకు విద్యుత్ సరఫరా ఇచ్చి ట్రయల్ రన్ నిర్వహించారు.కదిరిలో ప్రారంభమైన ట్రయల్ రన్ నల్లచెరువు, తనకల్లు, ములకలచెరువు మీదుగా తుమ్మణంగుట్ట వరకు సాగింది.మంగళవారం మధ్యాహ్నం పాకాల నుంచి కలికిరి వరకు కూడా ట్రయల్ రన్ నిర్వహించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కాగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఆఫ్ రైల్యే సేఫ్టీ(సీఆర్ఎస్) అభయ్‌కుమార్ రాయ్ బుధవారం కదిరి నుంచి తుమ్మణంగుట్ట, పాకాల నుంచి కలిరికి వరకు పూర్తయిన విద్యుదీకరణ పనులను తనిఖీ చేయనున్నారు. పాకాల నుంచి కలికిరి, తుమ్మణంగుట్ట నుంచి కదిరి వరకు మొదట డీజిల్‌తో నడిచే స్పెషల్ రైల్లో విద్యుదీకరణ పనులను పరిశీలిస్తారు. తరువాత కరెంటుతో నడిచే రైల్లో తనిఖీలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు.