జిల్లావ్యాప్తంగా జడివాన

ABN , First Publish Date - 2022-11-03T01:24:33+05:30 IST

జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా ముసురుపట్టి జడివాన కురుస్తోంది. అత్యధికంగా విజయపురంలో 43.2, అత్యల్పంగా పుంగనూరులో 4 మిమీ వర్షపాతం నమోదైంది.

జిల్లావ్యాప్తంగా జడివాన
చిత్తూరు నగరపాలక బస్టాండులో తడుస్తున్న ప్రయాణికులు

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 2: జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా ముసురుపట్టి జడివాన కురుస్తోంది. అత్యధికంగా విజయపురంలో 43.2, అత్యల్పంగా పుంగనూరులో 4 మిమీ వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా నిండ్రలో 36.8, తవణంపల్లెలో 31.6, వెదురుకుప్పంలో 31.2, ఐరాలలో 27.2, పలమనేరులో 27.2, పూతలపట్టులో 25.4, పెనుమూరులో 24.4, రామకుప్పంలో 23.4, శాంతిపురంలో 22, నగరిలో 20.8, గుడిపాలలో 20.8, రొంపిచెర్లలో 20.2, వి.కోటలో 20.2, పాలసముద్రంలో 17.4, గుడుపల్లెలో 16.8, కార్వేటినగరంలో 16.2, గంగవరంలో 16.2, సోమలలో 15.6, సదుంలో 14.4, యాదమరిలో 14.2, శ్రీరంగరాజపురంలో 13, చిత్తూరులో 11.4, గంగాధరనెల్లూరులో 10.8, బైరెడ్డిపల్లెలో 10.6, కుప్పంలో 10.4, పులిచెర్లలో 9.2, పెద్దపంజాణిలో 8.2, చౌడేపల్లెలో 7.4 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.

వానతో అవస్థలు

చిత్తూరు కల్చరల్‌: విడవని వానతో రెండు రోజులుగా చిత్తూరు నగరవాసులకు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు కార్యాలయాలకు, సామాన్య ప్రజలు బతుకు తెరువుకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. నగరంలోని రోడ్లపై మురుగునీరు చేరి అపరిశుభ్రంగా మారాయి.

Updated Date - 2022-11-03T01:24:37+05:30 IST