-
-
Home » Andhra Pradesh » Chittoor » It is an offense to sell plots in illegal layouts-NGTS-AndhraPradesh
-
అక్రమ లేఅవుట్లల్లో ప్లాట్లను విక్రయించడం నేరం
ABN , First Publish Date - 2022-03-16T05:42:41+05:30 IST
అక్రమ లేఅవుట్లల్లో ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేయడం నేరమని చుడా వైస్‌చైర్మన్ విశ్వనాథం హెచ్చరించారు.

చుడా వైస్‌చైర్మన్ విశ్వనాథం
గంగాధరనెల్లూరు, మార్చి 15: అక్రమ లేఅవుట్లల్లో ప్లాట్లను విక్రయించడం, కొనుగోలు చేయడం నేరమని చుడా వైస్‌చైర్మన్ విశ్వనాథం హెచ్చరించారు. జీడీనెల్లూరు ఎంపీడీవో సమావేశ మందిరంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మండలంలో ప్రైవేటు లేఅవుట్లపై ఆయా పంచాయతీ కార్యదర్శులు నివేదికలు అందజేయాలని చెప్పారు. లేఅవుట్‌లు వేసే యాజమానులు చుడాతో పాటు టౌన్‌ప్లానింగ్ వద్ద అప్రూవల్ చేసుకున్న తర్వాతే విక్రయుంచాల్సి ఉందన్నారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లను కొని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని ఎంపీడీవో శ్రీదేవి, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ ఎకేఆర్ మధు, చుడా సెక్రటరీ హరిబాబు, ఈవోపీఆర్డీ శివయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.