పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-07T07:20:24+05:30 IST

పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతిశాఖ సెట్విన్‌ సీఈవో తెలిపారు.

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 6: గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2023 జనవరి 26 తేదీన భారత ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతిశాఖ సెట్విన్‌ సీఈవో డాక్టర్‌.వి.మురళీకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళా, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, సైన్స్‌, ఇంజనీరింగ్‌ తదితర రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వ్యక్తులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హతలున్న అభ్యర్థులు పద్మఅవార్డ్స్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0877-2286921నెంబరును సంప్రదించాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను అలిపిరి వద్దవున్న సెట్విన్‌ కార్యాలయాలనికి చేర్చాలని లేదా ఈమెయిల్‌ అడ్రస్సు (సెట్విన్‌టీపీటీ7అట్‌దిరేట్‌ఆ్‌ఫయాహూ.సీవో.ఇన్‌) ద్వారా కూడా అందజేయవచ్చని వివరించారు. 

Read more