ఆర్టీసీ దుకాణాలకు టెండర్ల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-12T02:13:47+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల పరిధి బస్సు స్టేషన్‌లలో ఖాళీలున్న 96 దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తున్న ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీసీ దుకాణాలకు టెండర్ల ఆహ్వానం

తిరుపతి(కొర్లగుంట), నవంబరు 11: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల పరిధి బస్సు స్టేషన్‌లలో ఖాళీలున్న 96 దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తున్న ప్రజారవాణాధికారి చెంగల్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి సెంట్రల్‌ శ్రీహరి బస్సుస్టేషన్‌లో 14, శ్రీనివాస బస్సుస్టేషన్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో 10 చొప్పున, ఏడు కొండల బస్సుస్టేషన్‌లో 2, ఎ.రంగంపేటలో 3, చంద్రగిరి, నేండ్రగుంటలలో ఒక్కొక్కటి చొప్పున, పాకాలలో 4, భాకరాపేటలో 2, పుత్తూరు 3, శ్రీకాళహస్తి 6, సత్యవేడు 4, నాగలాపురం 1, వాకాడుకోట 9, గూడూరు 5, సూళ్లూరుపేట, నాయుడుపేట కలిపి 15, వెంకటగిరిలో 6 దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల వారు ఆయా డిపోల మేనేజర్లను సంప్రదించి దరఖాస్తులను స్వీకరించాలి. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2గంటలలోపు దరఖాస్తులను డీపీటీవో కార్యాలయంలో సమర్పించాలి. అదే రోజున మధ్యాహ్నం 3గంటలకు టెండర్లను ఓపెన్‌ చేస్తారు.

Updated Date - 2022-11-12T02:13:47+05:30 IST

Read more