డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-30T05:36:20+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పద్మజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 29: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు భర్తీ చేసేందుకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి పద్మజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ పూర్తిచేసి, 18-42 సంవత్సరాల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు చిత్తూరు నగరంలోని ఉపాధి కార్యాల యంలో అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు జిల్లా ఉపాధి కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు.


Read more