వైద్య, ఆరోగ్య శాఖ పోస్టులకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2022-10-11T05:55:29+05:30 IST

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం డీఆర్‌వో రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.

వైద్య, ఆరోగ్య శాఖ పోస్టులకు ఇంటర్వ్యూలు

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 10: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం డీఆర్‌వో రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 70 మంది అభ్యర్థులు హాజరుకాగా వారి ధ్రువీకరణ పత్రాలను డీఎంహెచ్‌వో శ్రీహరి, డీసీహెచ్‌ఎస్‌ డీసీకే నాయక్‌ పరిశీలించారు. డిప్యూటీ కలెక్టర్‌ భవానీ, ఏవో రమేష్‌ బాబు, తిరుపతి రూయా ఎంఎస్‌ నాగమునేంద్రుడు, ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Read more