హోంగార్డుల పోస్టింగులపై విచారణ

ABN , First Publish Date - 2022-09-19T06:07:59+05:30 IST

చిత్తూరు జిల్లాలో ఎంత మంది హోంగార్డులున్నారు? వారంతా ఎక్కడ పనిచేస్తున్నారనే అంశంపై విచారణ ప్రారంభమైంది. ‘ఉండాల్సినవారి కంటే ఎక్కువగా హోంగార్డులు ఉన్నారు. ఈ కారణంగా కొంత మందికి జీతాలు సక్రమంగా రావడం లేదు. విచారించి చర్యలు తీసుకోండి’ అని పేరు బయటికి చెప్పుకోని ఓ హోంగార్డు ఎస్పీ రిషాంత్‌రెడ్డికి లెటర్‌ రాశారు.

హోంగార్డుల పోస్టింగులపై విచారణ

చిత్తూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంత మంది హోంగార్డులున్నారు? వారంతా ఎక్కడ పనిచేస్తున్నారనే అంశంపై విచారణ ప్రారంభమైంది. ‘ఉండాల్సినవారి కంటే ఎక్కువగా హోంగార్డులు ఉన్నారు. ఈ కారణంగా కొంత మందికి జీతాలు సక్రమంగా రావడం లేదు. విచారించి చర్యలు తీసుకోండి’ అని పేరు బయటికి చెప్పుకోని ఓ హోంగార్డు ఎస్పీ రిషాంత్‌రెడ్డికి లెటర్‌ రాశారు. దీనిపై స్పందించిన ఆయన జిల్లాలోని హోంగార్డుల నియామకం, పోస్టింగ్‌ వంటి అంశాలపై విచారించాలని చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని హోంగార్డులంతా ఎప్పుడు చేరారు? ఎక్కడ పనిచేస్తున్నారనే అంశాలపై డీఎస్పీ విచారణ ప్రారంభించారు. జిల్లాలో 220 మంది హోంగార్డులు ఉన్నట్లు, ప్రతి నెలా వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. విచారణ తర్వాత హోమ్‌గార్డుల సంఖ్య సరిపోతే సమస్య ఉండదు. ఎక్కువగా కనిపిస్తే చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. గతేడాది రైల్వే విధులకు అధికారులు పది మంది హోంగార్డులను పంపిస్తే, అక్కడ 12 మంది హాజరైనట్లు గుర్తించారు. ఇద్దరు నకిలీ హోంగార్డులని, ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న ఓ వ్యక్తిని, నకిలీ హోంగార్డడలలుకక పాస్‌పోర్టులు ఇచ్చిన పోలీస్‌ కార్యాలయంలో పనిచేసే మరో ఉద్యోగిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు టూ టౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి వారిని రిమాండుకు కూడా పంపించిన విషయం తెలిసిందే. తాజాగా హోంగార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆకాశరామన్న ఉత్తరాలు ఎస్పీకి అందాయి. ‘హోంగార్డుల అంశంపై విచారణ ప్రారంభమైంది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటా’మని ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి తెలిపారు. 

Read more