-
-
Home » Andhra Pradesh » Chittoor » I came to Tirumala for blessings-NGTS-AndhraPradesh
-
తిరుమలేశుడి ఆశీస్సుల కోసం వచ్చా
ABN , First Publish Date - 2022-04-24T08:55:37+05:30 IST
శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు హాకీ క్రీడాకారిణి రజని తెలిపారు.

హాకీ క్రీడాకారిణి రజని
తిరుమల, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న ఏషియన్ గేమ్స్ పాల్గొనడానికి వెళ్లేముందుగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు హాకీ క్రీడాకారిణి రజని తెలిపారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆదివారం తిరిగి క్యాంపునకు వెళ్లి జాయిన్ అవ్వనున్నట్టు తెలిపారు.