గృహ నిర్బంధంలో ఎమ్మెల్సీ, యూటీఎఫ్‌ నేత నిర్మల

ABN , First Publish Date - 2022-04-25T05:21:13+05:30 IST

సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన స్కూటర్‌ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సలర్‌ నిర్మల హాజరుకాకుండా పోలీసులు వారిని గృహ నిర్భంధంలో ఉంచారు.

గృహ నిర్బంధంలో ఎమ్మెల్సీ, యూటీఎఫ్‌ నేత నిర్మల
గృహ నిర్భంధంలో ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి,

తిరుపతి(విద్య), ఏప్రిల్‌ 24: సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన స్కూటర్‌ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సలర్‌ నిర్మల హాజరుకాకుండా పోలీసులు వారిని గృహ నిర్భంధంలో ఉంచారు. వీరు బయటకు వెళ్లకుండా నివాసం వద్ద శనివారం రాత్రి నుంచి పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వివరాలు వారి మాటల్లోనే..

ప్రజాప్రతినిధులను నిర్బంధించడం న్యాయమా 

అప్రజాస్వామికంగా హౌస్‌ అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయం. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని సీఎం జగన్‌ పోలీసుల సాయంతో ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం, నిర్బంధించడం సబబుకాదు. సత్వరమే స్పందించి సంఘం నాయకులను, ఎమ్మెల్సీలను విడిపించాలి. సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో సీపీఎస్‌ ఉద్యోగుల ఉద్యమం పతాకస్థాయికి చేరుతుంది. 

- ఎమ్మెల్సీ, యండపల్లి శ్రీనివాసులరెడ్డి



రెండు రోజులుగా ఇంట్లోనే నిర్బంధించారు 

సీఎం జగన్‌ ఇచ్చిన హామీ అమలు చేయాలి. రావాల్సిన బకాయిలు, పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు చేయాలి. సోమవారం బైక్‌ ర్యాలీ జరగకుండా రెండు రోజుల ముందే పోలీసు యంత్రాంగం గృహ నిర్భంధం చేయడం తగదు. కనీసం వ్యక్తిగత పనులు కూడా చేసుకోనివ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి. సీపీఎస్‌ రద్దు చేయాలి. 

- నిర్మల, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ 

Updated Date - 2022-04-25T05:21:13+05:30 IST