మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం: డీఐజీ

ABN , First Publish Date - 2022-03-08T06:53:07+05:30 IST

మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారని డీఐజీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు.

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం: డీఐజీ
3కె రన్‌లో పాల్గొన్న విద్యార్థినులు, మహిళా పోలీసులు

చిత్తూరు, మార్చి 7: మహిళల భద్రత కోసం పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నారని, వారికి ఏ సమస్య ఎదురైనా వెంటనే స్సందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని డీఐజీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని సోమవారం చిత్తూరులోని గాంధీ విగ్రహం నుంచి పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల వరకు 3కె రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు డీఐజీ మాట్లాడుతూ.. పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలేనని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు.  ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ నిరంతరం వ్యాయామం  చేయాలన్నారు. మహిళలకు సమస్యలుంటే దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌తో పోలీసుల నుంచి రక్షణ పొందాలని సూచించారు. ఈ 3కే రన్‌లో పాల్గొన్న విద్యార్థినులు, మహిళా పోలీసులకు ఏఎస్పీ డీఎన్‌ మహేష్‌ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు లక్ష్మీనారాయణరెడ్డి, కృష్ణ మోహన్‌ (ఏఆర్‌), బాబుప్రసాద్‌ (దిశ), శ్రీనివాసులురెడ్డి (ఎస్‌బీ), అడ్మిన్‌ ఆర్‌ఐ జావిద్‌, ఎంటీవో నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-08T06:53:07+05:30 IST