కాణిపాకంలో అధిక సంఖ్యలో అక్షరాభ్యాసం

ABN , First Publish Date - 2022-10-03T05:57:47+05:30 IST

మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని వరసిద్ధుడి చెంత ఆదివారం అధిక సంఖ్యలో అక్షరాభ్యాసం చేయించారు.

కాణిపాకంలో అధిక సంఖ్యలో అక్షరాభ్యాసం
ఆలయం ఓనమాలు దిద్దుతున్న చిన్నారు

ఐరాల(కాణిపాకం), అక్టోబరు 2: మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని వరసిద్ధుడి చెంత ఆదివారం అధిక సంఖ్యలో అక్షరాభ్యాసం చేయించారు. మూలా నక్షత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తే చదువుల తల్లి సరస్వతి కటాక్షిస్తుందని నమ్మకం. ఈ కారణంతో 200 మందికి పైగా చిన్నారులకు ఓనమాలు దిద్దించారు. దీంతో కాణిపాక క్షేత్రం బాసరను తలపించింది.

Read more