హెల్త్‌ వర్శిటీ పేరు మార్పును వెనక్కి తీసుకోవాలి: టీడీపీ

ABN , First Publish Date - 2022-10-09T05:04:31+05:30 IST

అధికారం ఉందని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ పేరును మార్చిందని ద్నాన వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు.

హెల్త్‌ వర్శిటీ పేరు మార్పును వెనక్కి తీసుకోవాలి: టీడీపీ
నిరశన దీక్షలో ప్రసంగిస్తున్న మునిరత్నం

గుడుపల్లె, అక్టోబరు 8: అధికారం ఉందని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ పేరును మార్చిందని  ద్నాన వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పలువురు టీడీపీ నేతలు హెచ్చరించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పును వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు శనివారం గుడుపల్లె బస్టాండ్‌ ఎదుట నిరశన దీక్ష చేపట్టారు. అలాగే వైసీపీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా శ్రీకృష్ణ రాయబారం నాటకాన్ని వ్యంగంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వ మూడు సంవత్సరాల పాలనలో ప్రజలకు మాయ మాటలు చెబుతూ కాలాన్ని వెల్లదీయడం తప్ప ఒరిగిందేమిలేదన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీకి జగన్‌ తన తండ్రి వైఎస్‌ఆర్‌ పేరును మార్చడం ఆయన అరాచక పాలనకు పరాకాష్టగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త సంస్థలను ఏర్పాటు చేసి పేర్లు పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారని ఆ విషయాన్ని సీఎం జగన్‌ తెలుసుకోవాలని హితవు పలికారు.  చంద్రబాబు  కుప్పం ఎమ్మెల్యే అయ్యాక 30 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కుప్పం, పలమనేరు జాతీయ రహదారి ఏర్పాటు చేశారన్నారు. విద్యా రంగంలో అభివృద్ధి చెందాలని మెడికల్‌ కాలేజి, ఇంజనీరింగ్‌ కాలేజి, డిగ్రీ కాలేజి, ప్రతి మండలానికి జూనియర్‌ కాలేజీ, పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.  ప్రతి గ్రామానికి తారురోడ్డు, రక్షిత మంచి నీటి ట్యాంకులు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు ఏర్పాటు బాబు హయంలోనే జరిగాయ న్నారు.  ఇజ్రాయిల్‌ టెక్నాలజీ, బిందు, తుంపర్ల సేద్యాన్ని తెచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. కుప్పం ప్రజలు   సాగు, తాగు కోసం అల్లాడు తుంటే రూ.480కోట్లతో హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు 90 శాతం పూర్తి చేసింది చంద్ర బాబు హయంలోనే అని చెప్పారు. ఈ మూడు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో హంద్రీ- నీవా పనులు 10 శాతం కూడా చేయలేదన్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి  వైసీపీ ప్రభుత్వ పాలనలో వీసమెత్తు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం పాలనా కొనసాగిస్తుందన్నారు.  మూడు రాజధానుల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కుప్పం టీడీపీ ఇన్‌ఛార్జి పి.ఎస్‌.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌, మండల ఇన్‌ఛార్జి మునిరాజు, మండల అధ్యక్షుడు బాబు నాయుడు,  రెస్కో మాజీ చైర్మన్‌ చంద్రశేఖర్‌, నేతలు మాజీ ఎంపీపీ వెంకటేశ్‌, శాంతారామ్‌, శ్రీనివాసులు, హేమాంబర్‌గౌడు, బేటప్పనాయుడు, సత్యేంధ్రశేకర్‌, త్రిలోక్‌, ప్రేమకుమార్‌, గోపినాథ్‌, ఉదయ్‌కుమార్‌, విశ్వనాథం నాయుడు, నాగరాజు, మురళీమొహన్‌, పీవి నాగరాజు, అనసూయ, చంద్రకళా, సుగుణమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-09T05:04:31+05:30 IST