మద్యం మత్తులో నదిలో దిగి..!

ABN , First Publish Date - 2022-12-13T02:09:59+05:30 IST

చిత్తుగా మద్యం తాగిన ఓ యువకుడు కందూరు నదిని దాటే యత్నంలో కొట్టుకు పోతుండగా, అక్కడే ఉన్న గ్రామస్తులు అతడిని ఒడ్డుకు చేర్చారు.

మద్యం మత్తులో నదిలో దిగి..!
కందూరులో నదిలో పైపును పట్టుకుని ఉన్న యువకుడు

సోమల, డిసెంబరు 12: చిత్తుగా మద్యం తాగిన ఓ యువకుడు కందూరు నదిని దాటే యత్నంలో కొట్టుకు పోతుండగా, అక్కడే ఉన్న గ్రామస్తులు అతడిని ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సోమల మండలంలో చోటుచేసుకుంది. కందూరు- కలికిరి మార్గ మధ్యంలోని కందూరు హైస్కూల్‌ వద్ద ప్రవహిస్తు నదిపై నిర్మించిన తాత్కాలిక కల్వర్టు రెండు రోజుల కిత్రం భారీ వర్షంతో కొట్టుకు పోయింది. ఈమార్గంలో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో నదిలో ప్రవాహవేగం ఉండగానే కొందరు కందూరుకు వచ్చి తిరిగి గ్రామాలకు చేరుకోవడానికి నది ప్రవాహాన్ని దాటుతున్నారు. ఇలా సోమవారం సాయంత్రం కందూరులో మద్యం తాగిన ఓ యువకుడు నదిని దాటుతున్నాడు. మద్యం మత్తులో అదుపు తప్పి నదిలో కొంతదూరం కొట్టుకు పోయాడు. ఈ క్రమంలో సిమెంటు పైపును పట్టుకొని నిలబడగా.. గ్రామస్తులు అతడిని పట్టుకుని ఒడ్డుకు చేర్చారు.

Updated Date - 2022-12-13T02:09:59+05:30 IST

Read more