ఏపీఈఈయూ 1104 తిరుపతి సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గోపి

ABN , First Publish Date - 2022-09-22T05:19:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 1104 తిరుపతి సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా వెలకటూరి గోపి , సర్కిల్‌ ప్రాంతీయ అధ్యక్షులుగా వి.దేవేంద్రరెడ్డి, తిరుపతి సర్కిల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జి.వేణుగోపాల్‌, ట్రెజరర్‌గా ఎస్‌. జవహర్‌ మదానిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌, ఎన్నికల అధికారి కె.ప్రభుదాస్‌ వెల్లడించారు.

ఏపీఈఈయూ 1104 తిరుపతి సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గోపి
ఏపీఈఈయు 1104 తిరుపతి రీజియన్‌ నూతన కమిటీని సత్కరిస్తున్న సభ్యులు

తిరుపతి(ఆటోనగర్‌), సెప్టెంబర్‌ 21 : ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 1104 తిరుపతి సర్కిల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా వెలకటూరి గోపి , సర్కిల్‌ ప్రాంతీయ అధ్యక్షులుగా వి.దేవేంద్రరెడ్డి, తిరుపతి సర్కిల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా జి.వేణుగోపాల్‌, ట్రెజరర్‌గా ఎస్‌. జవహర్‌ మదానిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌, ఎన్నికల అధికారి కె.ప్రభుదాస్‌ వెల్లడించారు. స్థానిక టెలికం కాలనీలోని ఏపీయూయూ తిరుపతి సర్కిల్‌ కార్యాలయంలో ప్రాంతీయ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తిరుపతి సర్కిల్‌ ఇప్పటి వరకు మూడు జిల్లాలుగా విభజన కాలేదన్నారు. అప్పటి వరకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నూతన కమిటీ నాయకులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ నాయకులను చిత్తూరు ఆపరేషన్‌, రూరల్‌, పుత్తూరు, మదనపల్లి, పీలేరు, తిరుపతి ఆపరేషన్‌, రూరల్‌ డివిజన్ల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వై. కృష్ణమూర్తి, పాండురంగయ్య పాల్గొన్నారు. 

Read more