బంగారం చోరీ దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-09-17T05:52:35+05:30 IST

ఇళ్లలో ఎవరూ లేని సమయంలో చొరబడి బంగారు ఆభరణాలను చోరీ చేసే దొంగను పోలీసులు పట్టుకున్నారు.

బంగారం చోరీ దొంగ అరెస్టు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఐ యతీంద్ర

రూ.5 లక్షల ఆభరణాలు స్వాధీనం

మీడియా సమావేశంలో సీఐ యతీంద్ర వెల్లడి

చిత్తూరు, సెప్టెంబరు 16: ఇళ్లలో ఎవరూ లేని  సమయంలో చొరబడి బంగారు ఆభరణాలను చోరీ చేసే దొంగను పోలీసులు పట్టుకున్నారు. రూ.5లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. రెండో పట్టణ ఎస్‌ఐలు మల్లికార్జున, లోకే్‌షతో కలిసి సీఐ యతీంద్ర శుక్రవారం స్టేషన్‌ ఆవరణలో వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో చిత్తూరు నగరంలోని జానకారపల్లె, సంతపేట నాగాలమ్మ గుడివీధి, లాయర్స్‌ కాలనీలోని పలు ఇళ్లలో ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం వచ్చిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు-పలమనేరు రోడ్డులోని పీహెచ్‌కాలనీలో నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 96 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి 7  గంటలకు రిమాండ్‌కు తరలించారు. ద్విచక్ర వాహనాలు, కేబుల్‌, మొబైల్‌, ఏటీఎంలలో చోరీలకు పాల్పడినట్లు అతనిపై కేసులు ఉన్నాయి. కేసును చేధించిన భూషణ్‌, జయచంద్ర, సుధీర్‌, గోవిందు, శివకుమార్‌, ధరణీ కుమార్‌ను సీఐ అభినందించారు.


Updated Date - 2022-09-17T05:52:35+05:30 IST