-
-
Home » Andhra Pradesh » Chittoor » Glory be to all the earth-NGTS-AndhraPradesh
-
వైభవంగా తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2022-10-01T07:40:37+05:30 IST
తిరుమల బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.

తిరుమల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : తిరుమల బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం రాత్రి మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కొంగరూపంలో దాడికి వచ్చిన బకుడనే రాక్షసుడిని సంహరించే బాలకృష్ణుడి రూపంలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాజమన్నార్ రూపంలో చేతిలో చర్నాకోలు, మరో చేతిలో కమండలం, గోకాపరి రూపాన్ని అలంకరించుకున్న మలయప్ప ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఊరేగారు.చిరుజల్లుల నడుమ వాహనంపై గోవిందుడిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.జీయర్ స్వాములు, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి, బోర్డు సభ్యుడు అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు:
ఉదయం: 8-10గంటల మధ్య
మోహినీ అవతారం
రాత్రి: 7-2గంటలమధ్య
గరుడసేవ