అధికార నందిపై గణపయ్య

ABN , First Publish Date - 2022-09-11T07:53:32+05:30 IST

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శనివారం వరసిద్ధుడికి అధికారనంది వాహన సేవ నిర్వహించారు.

అధికార నందిపై గణపయ్య

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 10: కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శనివారం వరసిద్ధుడికి అధికారనంది వాహన  సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన వళ్లువర్‌ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకం చేశారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకు రావడంతో అలంకార మండపం వద్ద ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామిని అధికారనంది వాహనంపై ఉంచి పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీనివాస్‌ ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు, ఉభయదారులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు 

వరసిద్ధుడికి ఆదివారం రావణబ్రహ్మ వాహన సేవ జరగనుంది. పుణ్యసముద్రం, లక్ష్మాంబపురం,సంతపల్లె, ద్వారకాపురం,కురప్పపల్లె, సిద్ధంపల్లె, ముద్దురామాపురం గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. 

Read more