-
-
Home » Andhra Pradesh » Chittoor » free darsanam in kanipakam-NGTS-AndhraPradesh
-
నేటి నుంచి వరసిద్ధుడి ఆలయంలో ఉచిత దర్శనం
ABN , First Publish Date - 2022-04-24T05:45:47+05:30 IST
స్వయంభూ కాణిపాక వరసిద్ధుని ఆలయంలో భక్తులకు నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉచిత దర్శనానికి అనుమతిస్తూ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు నిర్ణయం తీసుకున్నారు.

- చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు
ఐరాల(కాణిపాకం), ఏప్రిల్ 23: స్వయంభూ కాణిపాక వరసిద్ధుని ఆలయంలో భక్తులకు నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉచిత దర్శనానికి అనుమతిస్తూ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు నిర్ణయం తీసుకున్నారు. శనివారం నూతన ఈవోకు చైర్మన్ పుష్పగుచ్చం అందించి అభినందించారు. రూ.51, రూ.100 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు, సర్వదర్శనం భక్తులకు ప్రతి రోజు ఐదుగంటల సమయం మాత్రం కేటాయించే వారు. అలా కాకుండా ఆలయం తెరచి ఉన్నంత వరకు ఉచిత దర్శనాన్ని కొనసాగించనున్నట్లు వారు వెల్లడించారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టు కూల్ పెయింట్, గ్రీన్ మ్యాట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. భక్తుల సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం వారిద్దరు కలసి ఆలయంలో నిర్వహిస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.