డీసీసీబీ చైర్‌పర్సన్‌ పదవీకాలం పొడిగింపు

ABN , First Publish Date - 2022-07-18T06:42:52+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, పాలకవర్గ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డీసీసీబీ చైర్‌పర్సన్‌ పదవీకాలం పొడిగింపు
రెడ్డమ్మ

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 17: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, పాలకవర్గ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ పాలకవర్గ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సహకార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవిచౌదరి పాలకవర్గం పదవీకాలాన్ని మరో ఆరు నెలల వరకు అంటే వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాలకవర్గ పదవీ కాలాన్ని పొడిగించినందుకు సీఎం జగన్‌కు చైర్‌పర్సన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Read more