రూ.400కోట్లు మంజూరైతే.. ఖర్చు రూ.65కోట్లేనా..!

ABN , First Publish Date - 2022-10-11T05:52:40+05:30 IST

జిల్లాలో నాడు-నేడు పనుల కోసం రూ.400 కోట్లు మంజూరైతే ఇప్పటివరకు రూ.65 కోట్ల పనులు మాత్రమే చేయడం సరికాదని, వేగం పెంచాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచిం చారు.

రూ.400కోట్లు మంజూరైతే.. ఖర్చు రూ.65కోట్లేనా..!

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 10 : జిల్లాలో నాడు-నేడు పనుల కోసం రూ.400 కోట్లు మంజూరైతే ఇప్పటివరకు రూ.65 కోట్ల పనులు మాత్రమే చేయడం సరికాదని, వేగం పెంచాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచిం చారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఇంజినీర్లు, మున్సిపల్‌ కమినర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కార్యక్రమం ముగింపునకు ఆరు నెలలు మాత్రమే వ్యవధి ఉందని, కేవలం 15 శాతం వ్యయం చేయడం ఏమిటని ప్రశ్నించారు.  వేగం పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌ ఎంవోయూలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, లేకుంటే రివాల్వింగ్‌ ఫండ్‌ కోల్పోయే అవకాశముందని తెలిపారు. సిమెంట్‌ కొరత ఉన్నచోట పక్కనున్న పాఠశాల నుంచి సర్దుబాటు చేసుకోవచ్చునన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఈవో పురుషోత్తం, ఏపీవో వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more