మాజీ మంత్రి నారాయణ కేసు 30కి వాయిదా

ABN , First Publish Date - 2022-09-21T05:43:30+05:30 IST

మాజీ మంత్రి నారాయణ కేసును న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

మాజీ మంత్రి నారాయణ కేసు 30కి వాయిదా

చిత్తూరు, లీగల్‌, సెప్టెంబరు 20: మాజీ మంత్రి నారాయణ కేసును న్యాయస్థానం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే. బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు చెందిన అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం తొమ్మిదో అదనపు జిల్లా కోర్టులో వాయిదా ఉండగా న్యాయమూర్తి శ్రీనివాస్‌ ఈ కేసును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. 

Read more