క్షాత్ర ధర్మంతోనే సమసమాజస్థాపన సాధ్యం

ABN , First Publish Date - 2022-07-18T06:05:37+05:30 IST

క్షాత్ర ధర్మంతోనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని క్షత్రియ సంక్షేమ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీఆర్‌ భానుప్రసాద్‌రాజు పేర్కొన్నారు.

క్షాత్ర ధర్మంతోనే సమసమాజస్థాపన సాధ్యం
ఐక్యతను చాటుతున్న క్షత్రియ సంక్షేమపరిషత్‌ ప్రతినిధులు

అల్లూరి మనువడికి సన్మానం

తిరుపతి(విద్య), జూలై17: క్షాత్ర ధర్మంతోనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని క్షత్రియ సంక్షేమ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీఆర్‌ భానుప్రసాద్‌రాజు పేర్కొన్నారు. తిరుపతిలోని మేక్‌ మై బేబీ స్కూల్‌ (ఎంఎంబీజీ)లో టీటీడీ క్షత్రియ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు మనవడు అల్లూరి శ్రీరామరాజును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్‌రాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో క్షాత్ర ధర్మాన్ని పటిష్ట పరచి సమాజాభివృద్ధికి క్షత్రియ వికాసం ఏర్పాటు చేశామని తెలిపారు. అల్లూరి శ్రీరామరాజు మాట్లాడుతూ వీరమరణం పొందిన విప్లవవీరుడు క్షత్రియ వంశీయుడు అని చెప్పడానికి ఎంతగానో గర్వ పడుతున్నానని తెలిపారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని నేటి క్షత్రియులు నిస్వార్థంగా సమాజసేవకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో తిరువల్లూరుకు చెందిన క్షత్రియసంఘం నాయకులు కన్నెరాజు, మునస్వామిరాజు, పాతపాటి రుక్మాంగధరాజు, సంగరాజు భాస్కర్‌రాజు, రుద్రరాజు గురుప్రసాద్‌రాజు, కోనేటి రవిరాజు, శ్రీరామమూర్తిరాజు, లక్ష్మీనారాయణరాజు, జ్యోతీశ్వర్‌రాజు, గణేశరాజు, గుండ్రాజు సుకుమార్‌రాజు, మనోహర్‌రాజు, గోవిందరాజులు, మహే్‌షరాజు, జీవీరాజు, కామరాజు పాల్గొన్నారు.   

Read more