విద్యార్థినులతో అసభ్య ప్రవర్తనపై విచారణ

ABN , First Publish Date - 2022-10-11T05:53:50+05:30 IST

కాణిపాకం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై సోమవారం విచారణ చేపట్టినట్లు సమాచారం.

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తనపై విచారణ

 ఐరాల(కాణిపాకం), అక్టోబరు 10: కాణిపాకం జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై సోమవారం విచారణ చేపట్టినట్లు సమాచారం. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విద్యార్థినులు కలెక్టర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సోమవారం పాఠశాలకు వచ్చి విద్యార్థినులతో మాట్లాడి సమాచారం సేకరించినట్లు తెలిసింది. విద్యార్థినుల తల్లిదండ్రులతోనూ మాట్లాడినట్లు తెలిసింది. కలెక్టర్‌కు నివేదికను సమర్పించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. 

Read more