డ్రగ్స్‌ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-11-08T01:16:43+05:30 IST

పెద్ద నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ వ్యవహారం ప్రస్తుతం పట్టణాలు, మండలాలకూ విస్తరించింది. విద్యార్థులు, యువకులకు ఓ మఠా డ్రగ్స్‌ సరఫరా చేస్తోంది. వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆ ముఠాను చిత్తూరు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.

డ్రగ్స్‌ ముఠా అరెస్టు
నిందితులను, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను మీడియాకు చూపుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

  • సూడాన్‌ దేశస్థుడితో పాటు మరో ఐదు మంది అరెస్టు

- రూ.2 లక్షల విలువ చేసే 34 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం

- మీడియా సమావేశంలో ఎస్పీ రిషాంత్‌రెడ్డి వెల్లడి

డ్రగ్స్‌ ముఠా చిక్కిందిలా..!

  • ఆరుగురి అరెస్టు.. ముగ్గురు పరార్‌

- 34 గ్రాముల మాదక ద్రవ్యాల స్వాధీనం

చిత్తూరు, నవంబరు 7: పెద్ద నగరాలకే పరిమితమైన డ్రగ్స్‌ వ్యవహారం ప్రస్తుతం పట్టణాలు, మండలాలకూ విస్తరించింది. విద్యార్థులు, యువకులకు ఓ మఠా డ్రగ్స్‌ సరఫరా చేస్తోంది. వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆ ముఠాను చిత్తూరు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయగా.. ముగ్గురు పరారయ్యారు. అరెస్టయిన వారిలో సూడన్‌ దేశస్థుడూ ఉన్నాడు. ఈ ముఠా నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.2.04 లక్షల విలువ చేసే 34 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌, డ్రగ్స్‌ వాడటానికి ఉపయోగించే 10 సిరంజిలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. డ్రగ్స్‌ ముఠా పట్టుబడిన విధానం పరిశీలిస్తే.. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన సిరాజ్‌ బెంగళూరులో పనిచేస్తున్నాడు. అక్కడ సూడన్‌ దేశానికి చెందిన అహ్మద్‌ ఒమర్‌తో పరిచయం ఏర్పడింది. అతడికి డ్రగ్స్‌ వాడే అలవాటుతో పాటు వాటిని అమ్ముతున్నాడని సిరాజ్‌ తెలుసుకున్నాడు. ఆ తరువాత సిరాజ్‌ చిత్తూరుకు చెందిన సురేష్‌, ప్రతాప్‌, తేజకుమార్‌, వెంకటేశ్‌, జయశంకర్‌, మోహన్‌తో పరిచయాలను ఏర్పరచుకున్నాడు. వారికి డ్రగ్స్‌ వ్యాపారం గురించి వివరించడంతో ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపాడు. దీంతో ఆ యువకులు చిత్తూరులో డ్రగ్స్‌ అమ్మడానికి ఒప్పుకున్నారు. కొంతకాలంగా డ్రగ్స్‌ను అమ్మి అధికమొత్తంలో సంపాదించారు. ఈ క్రమంలో ఆదివారం అహ్మద్‌ ఒమర్‌ను సిరాజ్‌, మిగిలిన వారందరూ డ్రగ్స్‌ను తీసుకుని చిత్తూరుకు రమ్మని చెప్పారు. దాంతో అహ్మద్‌ ఒమర్‌ బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తీసుకుని ఇరువారం సర్కిల్‌ వద్ద ఉన్న బాలత్రిపుర దేవస్థానం వద్దకు వచ్చాడు. ఇతడు అక్కడికి వస్తున్నట్లు చిత్తూరు పోలీసులకు సమాచారం వచ్చింది. నిందితులు డ్రగ్స్‌ను పంచుకుంటుండగా రెండో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తవణంపల్లె మండలం అరగొండకు చెందిన సిరాజ్‌(37), సూడాన్‌ దేశానికి చెందిన అహ్మద్‌ ఒమర్‌ అహ్మద్‌ సయీద్‌ అలియాస్‌ షాలూఫా(28), చిత్తూరు వేపమానువీధికి చెందిన సురేష్‌(25), తేనబండకు చెందిన జయశంకర్‌(32), తేజకుమార్‌(22), కట్టమంచికి చెందిన ప్రతా్‌ప(26)ను పట్టుకున్నారు. కట్టమంచికి చెందిన వెంకటేశ్‌, ఖాదర్‌మీరాన్‌ వీధికి చెందిన మోహన్‌, గంగనపల్లెకు చెందిన మురళి పరారయ్యారు. చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ యతీంద్ర, ఎస్‌ఐలు మల్లికార్జున, లోకేష్‌, ఏఎ్‌సఐ మనోహర్‌, కానిసేబుళ్లు జయచంద్ర, సుధీర్‌, గోవిందరావు, ధరణీ కుమార్‌, శివకుమార్‌, సెంథిల్‌కుమార్‌, నాగేంద్రబాబు, రాజే్‌షకుమార్‌, జయప్రకా్‌షరెడ్డిని ఎస్పీ అభినందించారు.

అహ్మద్‌ ఒమర్‌ ఇండియాకు ఎలా వచ్చాడు?

సూడన్‌కు చెందిన అహ్మద్‌ ఒమర్‌ ఇండియాలో బీసీఏ కోర్సు చేయాలని అనుకున్నాడు. 2013లో బెంగళూరులోని ఇండియన్‌ అకాడమీ డిగ్రీ కళాశాలలో మూడేళ్ల బీసీఏ కోర్సు చేయడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబరులో వీసా రావడంతో బెంగళూరు వచ్చాడు. అప్పటికే డ్రగ్స్‌కు అలవాటు పడ్ట ఇతడు.. తన వీసాను పొడిగించుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా డ్రగ్స్‌ను కొని.. అమ్మేవాడు. ఇతడిపై మంగళూరు పోలీసులు కేసు కేసు నమోదు చేశారు. సిరాజ్‌పైనా హెన్నూరు స్టేషన్‌లో, జయశంక్‌పై యాదమరి, చిత్తూరు ఒకటి, రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-11-08T01:16:43+05:30 IST

Read more