నిషేధిత సంస్థలను ప్రోత్సహించొద్దు

ABN , First Publish Date - 2022-12-10T00:19:42+05:30 IST

నిషేధిత సంస్థలకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించినా, ప్రోత్సహించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు.

నిషేధిత సంస్థలను ప్రోత్సహించొద్దు

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 9: నిషేధిత సంస్థలకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించినా, ప్రోత్సహించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది సంస్థలను కేంద్రప్రభుత్వం నిషేధించిందని పేర్కొన్నారు. వీటిల్లో.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ), దాని అనుబంధ సంస్థలు, రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఆర్‌ఐఎఫ్‌), క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (సీఎ్‌ఫఐ), ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌ (ఏఐఐసీ), నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఆర్‌వో), నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఆర్‌ఎ్‌ఫఐ)-కేరళ సంస్థలను కేంద్రప్రభుత్వం నిషేధించిందని వివరించారు. ఆయా సంస్థలను ఎవరూ ప్రోత్సహించరాదని, వాటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఎస్పీ సూచించారు.

Updated Date - 2022-12-10T00:19:46+05:30 IST