-
-
Home » Andhra Pradesh » Chittoor » Do not tolerate division by the name of classification Malamahanadu-NGTS-AndhraPradesh
-
వర్గీకరణ పేరుతో విభజిస్తే సహించం: మాలమహానాడు
ABN , First Publish Date - 2022-08-15T05:45:19+05:30 IST
వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విభజించడానికి పాలకులు ప్రయత్నిస్తే సహించేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్య క్షుడు యమలా సుదర్శనం, కార్యదర్శి ఎన్.ఆర్.అశోక్ అన్నారు. కుప్పంలో ఆదివారంనాడు ఎస్సీ వర్గీకర ణకు వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ నిర్వహించారు.

కుప్పం, ఆగస్టు 14: వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విభజించడానికి పాలకులు ప్రయత్నిస్తే సహించేది లేదని మాల మహానాడు రాష్ట్ర అధ్య క్షుడు యమలా సుదర్శనం, కార్యదర్శి ఎన్.ఆర్.అశోక్ అన్నారు. కుప్పంలో ఆదివారంనాడు ఎస్సీ వర్గీకర ణకు వ్యతిరేకంగా మాలమహానాడు ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 25 ఏళ్ల క్రితం నాటి పాల కులు, దళితుల ఐక్యత చూసి ఓర్వలేక మాల, మాదిగల్ని వర్గీకరణ పేరుతో విడదీయడానికి కుట్ర పన్నారన్నారని ఆరోపించారు. ఈ పేరుతో బలమైన, శక్తివంతమైన సమూహాన్ని నిట్టనిలువునా రెండుగా చీల్చారన్నారు. ఈ కుట్రను గుర్తించిన పీ.వీ.రావు న్యాయపోరాటం చేసి రాష్ట్రాలకు వర్గీకరణ అధికారం లేదని తీర్పు పొందారన్నారు. మధ్యలో ఆయన కాలం చేశాక, జూపూడి నాయ కత్వాన మాల మహానాడు మరింత నూతనో త్సాహంతో ఉద్యమ కెరటమై ఎగసిందన్నారు. మందకృష్ణ బీజేపీ పంచన చేరి మళ్లీ వర్గీకరణ మంత్రం పఠిస్తున్నారని ధ్వజ మెత్తారు. పాలకులు తమ రాజకీయ క్రీడకు దళి తులను బలిపశువులను చేయడం ఇకనైనా మాను కోవాలన్నారు. నాటి ఏకసభ్య కమిషన్ తప్పుడు నివేదికతో ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించిందని విమ ర్శించారు. రాయలసీమలో దళిత సామాజిక వర్గాలన్నీ దీన స్థితిలోనే ఉన్నాయన్నారు. కాబట్టి ఈ విభజిత రాజకీయాలకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీక రణను నిరసిస్తూ మాలలంతా ఏకం కావాలని పిలు పునిచ్చారు. మాలమహానాడు కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు కె.కన్నన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో రాయలసీమ అధ్యక్షులు రఘు, టి.సుబ్రమణ్యం, చౌదరి, మంజు, నాగమణి, మల్లెల మోహన్, పలమనేరు మున్సిపల్ కౌన్సిలర్ కె.శ్యామ సుందర్, దళిత నాయకులు కందస్వామి, తిమ్మ రాజు, సి.మునస్వామి, సి.విజయకుమార్, సుబ్బు, రాము, నవినాయక్, యల్లప్ప, నాగభూషణం, నారా యణ తదితరులు పాల్గొన్నారు.