జాతీయ స్థాయికి జిల్లా ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-12-12T00:11:27+05:30 IST

చిత్తూరులోని క్యాంఫర్డ్‌ స్కూల్‌ విద్యార్థిని లాస్య తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ప్రిజర్వేటివ్‌ సాసేట్స్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైయింది. శని, ఆదివారాల్లో తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర కాలేజి ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జరిగిన రాష్ట్ర స్థాయి నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నిర్వహించారు.

జాతీయ స్థాయికి జిల్లా ప్రాజెక్టు
మంత్రి రోజా నుంచి ప్రశంసా పత్రం అందుకుంటున్న లాస్య

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 11: చిత్తూరులోని క్యాంఫర్డ్‌ స్కూల్‌ విద్యార్థిని లాస్య తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ ప్రిజర్వేటివ్‌ సాసేట్స్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైయింది. శని, ఆదివారాల్లో తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర కాలేజి ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జరిగిన రాష్ట్ర స్థాయి నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నిర్వహించారు. జిల్లా నుంచి 182 ప్రాజెక్టులు ప్రదర్శింగా ఎకో ఫ్రెండ్లీ ప్రిజర్వేటివ్‌ సాసెట్స్‌ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. దీంతో మంత్రి రోజాతో పాటు డీఈవో విజయేంద్రరావు, జిల్లా సైన్స్‌ అధికారి రమణ లాస్యను అభినందించారు.

Updated Date - 2022-12-12T00:11:29+05:30 IST