AP News: జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు

ABN , First Publish Date - 2022-08-16T22:00:31+05:30 IST

జగన్‌కు ఓటేసినందుకు ఓ దివ్యాంగుడు చెప్పుతో కొట్టుకున్న ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది.

AP News: జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకున్న దివ్యాంగుడు

తిరుపతి (Tirupathi): జగన్‌కు (CM Jagan) ఓటేసినందుకు తమ చెప్పుతే తామే కొట్టుకున్న ఘటన తిరుపతి జిల్లా, వెంకటగిరి పరిధిలోని వెలంపాలెంలో జరిగింది. దివ్యాంగుడు వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు వారి చెప్పులతో వారే కొట్టుకుని నిరసన తెలిపారు. రెండు కాళ్లు పనిచేయవు, చేతులు వంకర్లు తిరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పెన్షన్ మంజూరైంది. ప్రస్తుత జగన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కు తోచని స్థితి ఏర్పడింది. తనలాంటి వందలాది మందికి పెన్షన్ తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైతే న్యాయం చేయాలని లేకపోతే ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Read more