అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ అజెండా: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2022-06-12T06:39:45+05:30 IST

రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం వి.కోటలో పంచాయతీ నిధులు రూ.1.3 కోట్లతో నిర్మించిన బస్టాండు ప్రాంగణాన్ని, వాణిజ్య సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ అజెండా: పెద్దిరెడ్డి
పంచాయతీ బస్టాండును ప్రారంభిస్తున్న మంత్రి

వి.కోట/ బైరెడ్డిపల్లె, జూన్‌ 11: రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం వి.కోటలో పంచాయతీ నిధులు రూ.1.3 కోట్లతో నిర్మించిన బస్టాండు ప్రాంగణాన్ని, వాణిజ్య సముదాయాన్ని మంత్రి  ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు ఎగువ చెక్‌పోస్టు కూడలికి చేరుకున్న ఆయనకు  వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎగువ చెక్‌పోస్టు కూడలిలో వైఎస్‌ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు.  అనంతరం కృష్ణమ్మ కొండకు చేరుకుని అక్కడ వేణుగోపాలస్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్‌, జడ్పీ  చైర్మన్‌ శ్రీనివాసులు, డీసీసీబీ చైౖర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, రెస్కో చైర్మన్‌ సెంథిల్‌కుమార్‌, కృష్ణమూర్తి, పీ.ఎన్‌.నాగరాజ్‌,  బాలగురునాథ్‌, ఎంపీపీ యువరాజ్‌,  డీఆర్‌డీఏ పీడీ తులసి, డీపీవో దశరథరామిరెడ్డి, డీఎస్పీ గంగయ్య, ఎంపీడీవో బాలాజీ, తహసీల్దార్‌ సీతారామన్‌ తదితరులు పాల్గొన్నారు. వి.కోట పర్యటనకు వెళ్తున్న పెద్దిరెడ్డికి బైరెడ్డిపల్లెలో శనివారం వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, ఎంపీపీ రెడ్డెప్ప తదితరులు మంత్రికి సాదరస్వాగతం పలికారు.  


Read more