చింత చెట్ల నరికివేత

ABN , First Publish Date - 2022-09-12T05:06:25+05:30 IST

కుప్పం పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం చుట్టుపక్కల రహదా రుల పక్కన ఉన్న భారీ చింత చెట్లను నరికేస్తు న్నారు. ఎక్స్‌కవేటర్లను తీసుకొచ్చి మరీ ఈ నరికి వేతను ఆదివారం కొనసాగించారు.

చింత చెట్ల నరికివేత
కుప్పంలో చెట్లను నరుకుతున్న కూలీలు

కుప్పం, సెప్టెంబరు 11:  పట్టణంలోని తహసీల్దారు కార్యాలయం చుట్టుపక్కల రహదా రుల పక్కన ఉన్న భారీ చింత చెట్లను  నరికేస్తు న్నారు. ఎక్స్‌కవేటర్లను తీసుకొచ్చి మరీ ఈ నరికి వేతను ఆదివారం కొనసాగించారు. కొత్తగా ని ర్మించిన దుకాణ సముదాయానికి అడ్డం వస్తుందనో లేక కార్యాలయాలకు ఇబ్బందిగా ఉందనో నెపం పెట్టి సాగు తున్న ఈ నరికివేతకు ఎవరు అనుమతి నిచ్చారో తెలియడంలేదు. మున్సిపల్‌ పరిధిలో నరికివేత యథేచ్ఛగా సాగు తోంది.  ఇప్పటి ధరలను బట్టి వీటి కలప లక్షల రూపాయలు పలుకుతుంది. మరి ఇంత విలువ కలిగిన కలప ఉన్నపుడు, నరికి వేతకు సంబంధించి ముందుగా టెండర్లను పిల వడం ఆనవాయితీ.  ఎక్కువ మొత్తం పాడుకున్న వారికి  అనుమతినివ్వడమే కాకుండా, వారికే కలప ను తీసుకెళ్లే అధికారం దఖలు చేస్తారు. కానీ ప్ర స్తుతం జరుగుతున్న వృక్షాల నరికివేతకు సంబంఽ దించి టెండరు పిలిచారో లేదో తెలియడంలేదు. అసలు ఈ ప్రభుత్వ శాఖ దీనికి అనుమతినిచ్చిందో చెప్పేవారు లేరు. సెలవు దినమైన ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా భారీ వృక్షాలను నరికి కలపను తరలించారు. వృక్షాల నరికివేతకు అనుమతినిచ్చారా లేదా అన్న విషయంలో వివరణ ఇచ్చేవారు లేకుండా పోయారు. బాధ్యత కలిగిన ఓ అధికారీ కచ్చితమైన సమాధానం ఇవ్వడంలేదు. ఇంతపెద్దయెత్తున వృక్షాలను నరికివేసి కలపను తరలించుకుపోవడంపట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చల్లని నీడను పట్టి జనాలను సేదతీర్చి ఆహ్లాదపరచడం తప్ప నిజానికి ఈ చెట్ల వల్ల ఎటువంటి ఇబ్బందీ లేదు. అయినా వృక్షాల నరికివేత సాగడం ఆశ్చర్యకరంగా ఉందని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.


Updated Date - 2022-09-12T05:06:25+05:30 IST