20 లోపు రీసర్వే పూర్తి

ABN , First Publish Date - 2022-09-17T05:54:27+05:30 IST

భూ రీసర్వే ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేసి, అక్టోబరు 2 రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటే శ్వర్‌ అధికారులను ఆధేశించారు.

20 లోపు రీసర్వే పూర్తి
జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ప్రసంగిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

చిత్తూరు కల్చరల్‌, సెప్టెంబరు 16 : భూ రీసర్వే ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేసి, అక్టోబరు 2 రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటే శ్వర్‌ అధికారులను ఆధేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, సర్వేయర్లతో  సమీక్షించారు. ఈ నెల 20వ తేదీ నాటికి వంద శాతం రీ సర్వే పూర్తి చేసి జేసీ, ఆర్‌డీవోల లాగిన్లకు  అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారం లోపు పాసు పుస్తకాల ప్రింటింగ్‌ పూర్తి చేసి, అక్టోబరు రెండు నాటికి రైతులకు పంపిణీ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్డీసీ పర్వీన్‌, డీటీ శివకుమార్‌, సర్వేయర్‌ గణేశ్‌ పాల్గొన్నారు.


Read more