పొలాల్లో విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2022-02-20T05:19:46+05:30 IST

Compensation of Rs. 1 lakh should be paid for setting up of power lines in the fields

పొలాల్లో విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు రూ.లక్ష పరిహారం చెల్లించాలి

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19: పంట పొలాల మీదుగా విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు సంబంధించి రైతులకు రూ.లక్ష మేరకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యుత్‌శాఖ అవసరాల కోసం రైతుల నుంచి తీసుకునే సెంటు భూమికి రూ.80వేలు పరిహారం చెల్లించేవారని, భూ విలువలు పెరిగిన కారణంగా ఇకపై రూ.లక్ష వరకు పరిహారం చెల్లించడంతో పాటు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలన్నారు. సమావేశంలో రిజిస్ర్టేషన్‌శాఖ డీఐజీ పుష్పలత, జిల్లా రిజిస్ర్టార్‌ పీవీఎన్‌ బాబు, మదనపల్లె ఆర్డీవో మురళి, ఉద్యానశాఖ డీడీ శ్రీనివాసులు, పశ్చిమ డివిజన్‌ డీఎఫ్‌వో రవిశంకర్‌, ట్రాన్స్‌కో అధికారి ప్రతాప్‌కుమార్‌, కురబలకోట, మదనపల్లె తహసీల్దార్లు పాల్గొన్నారు.

Read more