వెళ్లారు.. వచ్చారు!

ABN , First Publish Date - 2022-11-08T01:13:07+05:30 IST

శాంతిపురం రెవెన్యూ వర్గాల సర్వే పరిస్థితి. శాంతిపురం మండలంలోని అతిపెద్దదైన సోగడబల్ల చెరువును అధికార వైసీపీ నాయకులు సుమారు పది ఎకరాల మేర ఆక్రమించుకుని పంట పొలాలు వేశారు.

వెళ్లారు.. వచ్చారు!
చెరువును ఆక్రమించి వేసిన వ్యవసాయ బోరు, టమోటా తోట - చెరువులో స్థలాన్ని చదును చేసి పండిస్తున్న క్యాబేజీ పంట

ఫ చెరబట్టిన చెరువు ఆక్రమణలపై ఉత్తుత్తి సర్వే

కుప్పం, నవంబరు 7: ‘రామయ్య వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడు...’ అన్న సామెత చందంగా తయారయింది, శాంతిపురం రెవెన్యూ వర్గాల సర్వే పరిస్థితి. శాంతిపురం మండలంలోని అతిపెద్దదైన సోగడబల్ల చెరువును అధికార వైసీపీ నాయకులు సుమారు పది ఎకరాల మేర ఆక్రమించుకుని పంట పొలాలు వేశారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 6వ తేదీన ‘చెరువును చెరబట్టారు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు స్పందించారు. మండల సర్వేయర్‌తోపాటు వీఆర్వోలు సోమవారం సోగడబల్ల చెరువు వద్దకు వెళ్లి సర్వే చేసి ఆక్రమిత స్థలమున్నదని తేల్చి, గుర్తులు నాటారు. ఆ సమయంలో వారితో వాగ్వాదానికి దిగిన ఆక్రమణదారులు, అధికారులు రెవెన్యూ సిబ్బంది అటు వెళ్లగానే వారు నాటిన గుర్తులను పీకేసి చక్కా వచ్చేశారు. ఈ విషయం రెవెన్యూ సిబ్బందితోపాటు తహసీల్దారుకుకు తెలిసినా తదుపరి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ఆర్డీవో శివయ్యకు ఇదే విషయమై మాజీ సర్పంచి గోపాల్‌ ఫోన్‌ ద్వారా చెప్పారు. కానీ సాయంత్రం దాకా అధికారులవైపు నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదు.

Updated Date - 2022-11-08T01:13:28+05:30 IST

Read more