22న క్పుంలో సీఎం బహిరంగ సభ

ABN , First Publish Date - 2022-09-13T05:52:29+05:30 IST

సీఎం జగన్‌ ఈనెల 22న కుప్పం బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్‌ చేయూత మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి సోమవారం కుప్పంలో బహిరంగ సభ, హెలీప్యాడ్‌ స్థలాల కోసం పలు ప్రాంతాలు పరిశీలించారు.

22న క్పుంలో సీఎం బహిరంగ సభ
కుప్పంలో సీఎం సభావేదికకోసం స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు

3వ విడత చేయూత ఇక్కడినుంచే ప్రారంభం


బహిరంగ సభా వేదిక స్థలాలను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి


కుప్పం, సెప్టెంబరు 12: సీఎం జగన్‌ ఈనెల 22న కుప్పం బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్‌ చేయూత మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.  మంత్రి పెద్దిరెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌,  ఎస్పీ రిషాంత్‌రెడ్డి సోమవారం కుప్పంలో బహిరంగ సభ, హెలీప్యాడ్‌ స్థలాల కోసం పలు ప్రాంతాలు పరిశీలించారు. పీఈఎస్‌ వైద్య కళాశాల, కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా ఉన్న మైదానాలను హెలీప్యాడ్‌ కోసం పరిశీలించారు. సభావేదిక ఏర్పాటుకోసం ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా మైదానంతోపాటు ఎన్టీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా ఉన్న మైదానం, ఎన్టీఆర్‌ స్టేడియంలను పరిశీలించారు. చివరకు బంగారునత్తం పంచాయతీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా ఉన్న మైదానాన్ని సభా వేదిక కోసం ఖరారు చేసినట్లు తెలిసింది. అలాగే   చెరువు కట్టకు ఈవల  మైదానంలో ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌లో దిగి, కుప్పం పట్టణం మీదుగా సభావేదికను చేరుకునేలా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. 


Read more