-
-
Home » Andhra Pradesh » Chittoor » Chittoor-MRGS-AndhraPradesh
-
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-02-23T20:46:26+05:30 IST
చిత్తూరు: జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది.

చిత్తూరు: జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. వి.కోటమండలం, కొంగాటంలో గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్ ధరించి, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. తమను అకారణంగా తొలగించడంపై ఆందోళన చేశారు. సరైన కారణాలు లేకుండా తమను ఎందుకు తొలగించారో చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.